: ఆ దుర్మార్గుడిని ఎలా మరిచిపోతా?: రెండోసారి ‘ఉబెర్’ నిందితుడిని గుర్తు పట్టిన బాధితురాలు
ఇంటివద్ద దించుతానంటూ కారెక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ బాధితురాలికి తీరని గాయమే చేశాడు. అందుకే అతడికి కఠిన శిక్ష వేయించాలని బాధిత యువతి నిర్ణయించుచుకుంది. మొన్నటికి మొన్న ఈ దెయ్యమే నన్ను చెరిచిందంటూ కేకలేసిన బాధితురాలు, తాజాగా గురువారం జరిగిన రెండో ఐడెంటిఫికేషన్ పరేడ్ లోనూ నిందితుడిని గుర్తు పట్టింది. తనపై అఘాయిత్యం జరిగిన సందర్భంగా నిందితుడు వేసుకున్న దుస్తులతో పాటు అతడు వాడిన మొబైల్ ఫోన్ నూ గుర్తించింది. అంతేకాక ఈ కేసులో ఆమె ఇంతకుముందు ఇచ్చిన వాంగ్మూలంతో తాజాగా ఆమె చెప్పిన విషయాలు సరిపోలినట్లు పోలీసులు తేల్చారు.