: బారాముల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఓ ఉగ్రవాది అరెస్టయ్యాడు. జిల్లాలోని చౌపాలా వద్ద కాశ్మీర్ పోలీసులు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. భారత గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వస్తున్న నేపథ్యంలో భారత్ లో దాడులు చేసేందుకు పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న సమాచారంతో సైన్యం సరిహద్దు వెంట కట్టుదిట్టమైన భద్రతను చేపట్టింది. అయినా లష్కరే తోయిబాకు చెందిన సదరు ఉగ్రవాది సైన్యం కళ్లుగప్పి, చౌపాలాలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.