: గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు మోక్షం... ఎనిమిది నెలల్లో మారనున్న రూపురేఖలు
నవ్యాంధ్ర రాజధానికి సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు సంబంధించిన బ్లూ ప్రింట్ కు ఆమోదం తెలిపింది. గన్నవరం ఎయిర్ పోర్టు టెర్మినల్ నమూనాను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గన్నవరం ఎయిర్ పోర్టు కీలక విమానాశ్రయంగా మారిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గన్నవరం నుంచి ఢిల్లీకి విమాన సేవలు కూడా ప్రారంభమయ్యాయి. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణ కూడా పూర్తైంది. మరో ఎనిమిది నెలల్లో గన్నవరం రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ లో 350 మంది కూర్చోవడానికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.