: సునంద కేసులో థరూర్ పాత్ర... ఎయిమ్స్ వైద్యుడి ఈ-మెయిల్ కు థరూర్ మెసేజెస్!


సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఎయిమ్స్ వైద్యుడిని ప్రశ్నించారు. సునంద మృతదేహానికి శవ పరీక్ష చేసిన వైద్య బృందానికి నేతృత్వం వహించిన ఎయిమ్స్ వైద్యుడు సుధీర్ గుప్తాను ఢిల్లీ డీసీపీ కుష్వాహా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గుప్తా ఇచ్చిన నివేదిక ఆధారంగానే పోలీసులు సునంద మరణాన్ని హత్య కేసుగా మార్చారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన విచారణ సందర్భంగా సుధీర్ గుప్తా, పలు విషయాలను పోలీసులకు తెలిపారు. తన ఈ-మెయిల్ కు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కొన్ని సందేశాలు పంపారని గుప్తా తెలిపారు. పోలీసులు సదరు సందేశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. అసలు శవ పరీక్ష చేసిన వైద్యుడికి సందేశాలు పంపాల్సిన అవసరం థరూర్ కెందుకొచ్చిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే థరూర్ ను కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. థరూర్ ను త్వరలోనే విచారించనున్నట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ కూడా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News