: ఫాంహౌస్ లో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు... ఆదివారం పాలమూరు పర్యటన!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంక్రాంతి సంబరాలను తన సొంత వ్యవసాయ క్షేత్రంలో (ఫాంహౌస్) ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతికి తన సొంతూరు వెళితే, కేసీఆర్ మాత్రం వ్యవసాయ క్షేత్రంలో ఉల్లాసంగా గడిపారు. కొడుకు కేటీఆర్, కూతురు కవిత కుటుంబాలతో కలిసి ఆయన మెదక్ జిల్లా గజ్వేల్ పరిధిలోని తన ఫాంహౌస్ లో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఇదిలా ఉంటే, ఈ నెల 18న ఆయన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఉత్తర తెలంగాణపైనే కేసీఆర్ దృష్టి పెట్టారన్న విమర్శల నేపథ్యంలో ఆయన పాలమూరు పర్యటనకు మొగ్గుచూపినట్లు సమాచారం.