: ఈ వరల్డ్ కప్ లో భారత్ ను ఓడిస్తాం... చరిత్ర తిరగరాస్తాం: పాక్ క్రికెటర్ యూనిస్ ఖాన్


రానున్న వరల్డ్ కప్ లో భారత్ పై విజయం సాధించి, చరిత్ర తిరగరాస్తామని పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అన్నాడు. భారత్ పై ప్రపంచకప్ లో పైచేయి సాధించేందుకు రానున్న వరల్డ్ కప్ ఈవెంట్ తమకు చక్కని అవకాశమని ఈ పాక్ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో మొదలుకానున్న వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ లు ఆడిలైడ్ లో తలపడనున్నాయి. ప్రపంచ కప్ లో ఇప్పటిదాకా భారత్ పై పాక్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అయితే, ఈసారి మాత్రం భారత్ పై విజయం సాధించి, చరిత్ర సృష్టించేస్తామని యూనిస్ ధీమాగా చెప్పేస్తున్నాడు.

  • Loading...

More Telugu News