: విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలను అమలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నేటి మధ్యాహ్నం ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీల అమలుపై చంద్రబాబు, కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన వెంకయ్య, విభజన చట్టం హామీలను నెరవేర్చి తీరతామని ప్రకటించారు. విభజన చట్టంలో కాంగ్రెస్ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. యూపీఏ సర్కారు చేసిన తప్పులను సరిదిద్ది, తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. దశలవారీగా హామీలను అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.