: కాకినాడ ఎల్ఎన్ జీ టెర్మినల్ అభివృద్ధికి కుదిరిన ఒప్పందం
ఏపీలోని కాకినాడలో ఏర్పాటు కానున్న ఎల్ఎన్ జీ టెర్మినల్ అభివృద్ధికి ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం (ఏపీజీడీసీ), కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలు జీడీసీ, గెయిల్, ప్రైవేట్ సంస్థ షెల్ ల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రదాన్, అశోక గజపతిరాజు, సుజనా చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, ఏపీ సర్కారు తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒప్పందంపై ఏపీ తరఫున ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల తరఫున ఆయా సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.