: విభజన చట్టం హామీలను అమలు చేయండి: ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన నేటి సాయంత్రం ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక సంస్థలకు రాయితీలు, పోలవరం తదితర అంశాలను ప్రధానితో చంద్రబాబు ప్రస్తావించారు. అంతేకాక రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చాలని కూడా ఆయన మోదీని కోరారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేటి ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు.