: సునంద పుష్కర్ కేసులో ఎయిర్ ఇండియా అధికారులను ప్రశ్నించనున్న పోలీసులు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరమైంది. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఎయిర్ ఇండియా అధికారులను ప్రశ్నించనున్నారు. శశి థరూర్, సునందలు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించిన నేపథ్యంలో ఆ సంస్థ అధికారులను ప్రశ్నించడం ద్వారా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కీలక సాక్ష్యంగా భావిస్తున్న థరూర్ పనిమనిషి నారాయణ సింగ్ ను పోలీసులు ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే. పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు ఎయిర్ ఇండియా అధికారులను విచారించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.