: కిరణ్ బేడీ రాజకీయ అరంగేట్రం ఆనందంగా ఉంది: ఆప్ అధినేత కేజ్రీవాల్


రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ రాజకీయ రంగ ప్రవేశంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. కిరణ్ బేడీ రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉందని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలని కిరణ్ బేడీని తాను ఎన్నోసార్లు ఆహ్వానించానని, అయితే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చిన ఆమె ఎట్టకేలకు రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. కిరణ్ బేడీ అంటే తనకు అపార గౌరవమని కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం కిరణ్ బేడీ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News