: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తో ఏపీ సీఎం భేటీ


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై ప్రధానితో చర్చించిన చంద్రబాబు, ఆ తర్వాత రాజ్ నాథ్ తోనూ భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, ఉమా భారతిలతో సమావేశమయ్యారు. రేపు వెంకయ్యతో కలిసి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News