: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కు షాక్... బీజేపీలో చేరిన దీదీ కేబినెట్ మంత్రి
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బలపడుతోందన్న తృణమూల్ కాంగ్రెస్ భయాలు నిజమేనని రూఢీ అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సభ్యత్వంతో పాటు రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ నేత, మంజుల్ కృష్ణ ఠాకూర్ బీజేపీలో చేరారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందన్న ఆయన, తృణమూల్ కాంగ్రెస్ లో మంచివారికి చోటు లేదని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ వల్ల రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ కారణంగానే మంత్రి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.