: బీజేపీ నేతగా భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి... కమలదళంలో చేరిన కిరణ్ బేడీ


భారత దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా చరిత్ర పుటలకెక్కిన కిరణ్ బేడీ బీజేపీ నేతగా మారారు. తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగానే కాక విధినిర్వహణలో సమర్థవంతమైన పోలీసు అధికారిణిగా గుర్తింపు పొందిన ఆమె కొద్దిసేపటి క్రితం బీజేపీలో చేరారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కిరణ్ బేడీని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల సమక్షంలో కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. కిరణ్ బేడీ చేరికతో తమ పార్టీ ఢిల్లీలో మరింత బలోపేతం కానుందని ఈ సందర్భంగా అమిత్ షా ప్రకటించారు. బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా సీఎం పదవి చేపట్టేందుకు అవకాశముందని ఆయన ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News