: కోల్ కతాలో బిగ్ ఫైట్... తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై సీపీఎం దాడి
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష సీపీఎంల మధ్య విబేధాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. నిన్నటిదాకా మాటల దాడికి పరిమితమైన ఈ విభేదాలు తాజాగా భౌతిక దాడులకూ విస్తరించాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోష్ పై సీపీఎం కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం దాడి చేశారు. కోల్ కతాలో జరిగిన ఈ దాడిలో కకోలీ ఘోష్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దాడిలో సీపీఎం యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఎం మహిళా నేతలు తమ దుస్తులు తామే చించుకుని ప్రత్యర్థులపై కేసులు పెడతారని నిన్న తృణమూల్ మంత్రి స్వపన్ దేవ్ నాథ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్నే సృష్టించాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ కకోలీ ఘోష్ పై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.