: 'గోపాల గోపాల' చిత్రంపై పోలీసు కేసు!
ఇటీవల విడుదలైన 'గోపాల గోపాల' చిత్రంలో న్యాయవాదులను కించపరచే సన్నివేశాలు వున్నాయని హైదరాబాదు శివారు సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని కొందరు లాయర్లు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. న్యాయవాదులను దుర్భాషలాడుతూ ఉన్న కొంత భాగాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కేసును పరిశీలిస్తామని పోలీసులు వారికి తెలిపారు.