: పాఠ్య పుస్తకాల్లో 'పంది' ప్రస్తావన వద్దు: ఆక్స్ ఫోర్డ్ వర్శిటీ


ముస్లింలు, జ్యూస్ ల నుంచి వచ్చే వ్యతిరేకతను తప్పించుకునేందుకు పాఠ్య పుస్తకాల్లో 'పంది' ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడాలని ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ తన రచయితలకు విజ్ఞప్తి చేసింది. పంది, పంది మాంసం, మాంసం కూరలు తదితర మాటలు పుస్తకాల్లో ప్రచురితం కాకుండా చూడాలని కోరింది. ఈ విషయాన్ని ఆక్స్ ఫోర్డ్ కు రచనలు అందించే జిమ్ నౌగిట్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రచురణకర్తల నుంచి తనకు లేఖ అందిందని తెలిపారు. కాగా, ఈ నిర్ణయాన్ని ఆక్స్ ఫోర్డ్ సమర్థించుకుంది. తమ పుస్తకాలు 200 దేశాల్లో అమ్ముడవుతాయని, వివిధ మతాల సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత తమపై వుందని తెలిపింది.

  • Loading...

More Telugu News