: సీబీఐ విచారణకు రాలేనన్న తృణమూల్ నేత


శారదా స్కాంలో సీబీఐ విచారణకు తాను ఇప్పట్లో హాజరు కాలేనని తృణమూల్ నేత, ఎంపీ ముఖుల్ రాయ్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆయన నేడు సీబీఐ ముందు హాజరు కావాల్సివుంది. ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా వున్నందున 15 రోజుల సమయం ఇవ్వాలని రాయ్ తరపు న్యాయవాది ఓ లేఖను అధికారులకు అందించారు. అయితే వారం రోజుల సమయం ఇచ్చేందుకు మాత్రమే సీబీఐ అధికారులు అంగీకరించినట్టు తెలిసింది. కాగా, తను ఢిల్లీలో వున్నానని, కోల్ కతా రాగానే విచారణకు సహకరిస్తానని రాయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News