: కేజ్రీవాల్ పై జయప్రద పోటీ... యోచిస్తున్న బీజేపీ!
ప్రముఖ నటి జయప్రద బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పోటీకి జయప్రదను దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.