: భద్రాద్రిలో భక్తుల కిటకిట
శ్రీరామనవమి పండుగతో ఖమ్మం జిల్లా భద్రాద్రి భక్తులతో పోటెత్తింది. మరికాసేపట్లో జరగనున్న రాముడి కల్యాణ దర్శనం కోసం భక్తులు గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడి మిథిలా స్టేడియంలో కల్యాణ మండపం, రామాలయం, రాజవీధి భక్తులతో నిండి పోయింది. దశరధ రాముడి కల్యాణం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర గవర్నర్ ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. వేలమంది భక్తులకు అన్నదానాలు కూడా చేయనున్నారు.