: ఆర్బీఐ పండగ కానుక... చలామణిలోకి యాభై వేల కోట్ల రూపాయలు!


మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ, తక్షణం అమలులోకి వచ్చేలా రేపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ)ను పావు శాతం తగ్గిస్తున్నట్టు నేటి ఉదయం ప్రకటించింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను మాత్రం ఆర్బీఐ సవరించలేదు. కాగా, రేపో రేటు 8 నుంచి 7.75 శాతానికి తగ్గిన కారణంగా సుమారు యాభై వేల కోట్ల రూపాయలు చలామణిలోకి రానున్నాయి. గృహ రుణాలు తగ్గే అవకాశం ఉంది. గత కొంత కాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతూ రావడంతో కీలక రేట్లను ఆర్బీఐ సవరించవచ్చని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. కాగా, తదుపరి ఆర్బీఐ పరపతి సమీక్ష వచ్చేనెల 3న జరగనుంది.

  • Loading...

More Telugu News