: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ కు గుర్తింపు!


అవును, మీరు చదివింది నిజమే! ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజా జాబితా విడుదల చేసింది. దేశంలో మొత్తం 1,807 రాజకీయ పార్టీలుండగా, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. మరో 64 రాష్ట్రస్థాయి పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఏపీలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ తోపాటు టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. తెలంగాణలో టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ లతోపాటు ఎంఐఎంకు రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పాల్గొని నిబంధనల మేరకు ఓట్లను తెచ్చుకోవడంలో విజయం సాధించినందునే టీఆర్ఎస్ కు ఏపీలో గుర్తింపు లభించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News