: కేసీఆర్ పై అన్న కూతురు ఫైర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన అన్న కూతురు రమ్య ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడినే అనుకుంటున్నారని... అందుకే మీడియాను కూడా పాతరేస్తానంటున్నారని విమర్శించారు. రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్న కేసీఆర్... ఇప్పుడు మాట మార్చి ఫిలిం సిటీని కీర్తిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పూర్తి అభద్రతాభావంలో ఉన్నారని... అందుకే ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు రమ్య కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను విమర్శించే స్థాయి మంత్రి హరీష్ రావుకు లేదని మండిపడ్డారు.