: ఇరు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితంలో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాచీన సంప్రదాయాలను సంక్రాంతి పండుగ ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇరు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అభిలషించారు.