: కాంగ్రెస్ లో చేరిన కేసీఆర్ అన్న కూతురు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్న కూతురు రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెకు సభ్యత్వాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పొన్నాల. రమ్య చేరికతో కేసీఆర్ ను ఢీకొనడానికి మంచి అవకాశం లభించినట్టైందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.