: భూములివ్వబోమంటూ ముగ్గులతో నిరసన
ఏపీ నూతన రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు తమ భూములను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కార్యక్రమాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. తాము రాజధాని కోసం భూముల ఇవ్వబోమంటూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల రూపంలో తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. కృష్ణా నది తీరాన ఉన్న మొత్తం తొమ్మిది గ్రామాల ప్రజలు తమ భూములను ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులతో ఈ గ్రామస్తులు చేపట్టిన నిరసన ఆకట్టుకుంటోంది.