: నాసిక్ పోలీసుస్టేషన్ ను ధ్వంసం చేసిన సైనికులు
తాము దేశ రక్షణ విధుల్లో ఉన్నామన్న స్పృహను కోల్పాయారు కొందరు సైనికులు. ఏకంగా పోలీసుస్టేషన్ పై పడి వీరంగం సృష్టించారు. తమ ఉన్నతాధికారిపై పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ, సుమారు 20 మంది ఆర్మీ జవాన్లు నాసిక్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఒక మహిళా అధికారిణి సహా పలువురు పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.