: కేసీఆర్ కు భగవంతుడు శక్తిని ప్రసాదించాలి: ఎం.సత్యనారాయణరావు
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ ఇస్తున్న వాగ్దానాలు చాలా బాగున్నాయని... అవన్నీ అమలైతే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అందువల్ల వాగ్దానాలను నెరవేర్చే శక్తి కేసీఆర్ కు భగవంతుడు ఇవ్వాలని కోరుకున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్ఠానం సరిగా వ్యవహరించలేదని అభిప్రాయపడ్డారు. అయితే, సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.