: నా అదృష్టం బాగాలేదు: కాంగ్రెస్ నేత ఎమ్మెస్సార్
తన అదృష్టం బాగాలేకనే గవర్నర్ పదవి వరించలేదని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షడు, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) నిట్టూర్చారు. నేటి ఉదయం తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న ఎమ్మెస్సార్ మీడియాతో మాట్లాడుతూ, తనకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎంతగానో ప్రయత్నించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సోనియా దయతోనే సాధ్యమైందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించలేకపోయామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.