: పార్టీ వ్యతిరేకులపై వేటేయండి: కాంగ్రెస్ అధిష్ఠానికి పాల్వాయి సూచన


పార్టీలోనే ఉంటూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని కూడా ఆయన అధిష్ఠానం పెద్దలకు సలహా ఇచ్చారు. హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన పలువురు పార్టీ నేతల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 21 సీట్లకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, అధికార టీఆర్ఎస్ విసురుతున్న ఆకర్ష్ వలకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు గులాబీ తీర్ధం పుచ్చుకుంటున్నారని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వైఖరిపై ఆగ్రహంతో ఉన్న పార్టీ సీనియర్లు ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. ఆ దిశలోనే పాల్వాయి కూడా గళమెత్తారు.

  • Loading...

More Telugu News