: షీలా దీక్షిత్ శకం ముగిసింది... ఎన్నికలపై నిరాసక్తత వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి!


"నా వరకూ నేను షీలా దీక్షిత్ శకం ముగిసిందనే భావిస్తున్నా" అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. వచ్చే నెల 7న జరగనున్న ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను అజయ్ మాకెన్ తలకెత్తుకున్న సంగతిని ఆమె ప్రస్తావిస్తూ, "ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎంతటి మహర్దశ అయినా ఏదో ఒక రోజు ముగుస్తుంది" అని షీలా అన్నారు. 2003 నుంచి 2013 వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు మోసిన షీలా, చివరగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల హవాతో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. మాకెన్ నాయకత్వంలో పార్టీ విజయ తీరాలకు చేరుతుందని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News