: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం... స్థానికులతో చంద్రబాబు మమేకం!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. తన సొంత గ్రామం నారావారిపల్లెలో కొద్దిసేపటి క్రితం ఆయన తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన స్థానికులతో కలిసిపోయారు. గ్రామస్థులతో మమేకమైన చంద్రబాబు, వారితో కరచాలనాలు చేస్తూ ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు రావడంతో నారావారిపల్లె వాసులు అమితానందంలో మునిగిపోయారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు కూడా నారావారిపల్లెకు వచ్చారు. ఇదిలా ఉంటే, చంద్రబాబు రాకతో ఆ గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News