: తరతరాలుగా భోగి పండగకు దూరమైన అచ్చ తెలుగు పల్లె!
ఆ గ్రామంలో భోగి సందడి కనిపించదు. తెల్లవారుఝామున ఇళ్ళముందు భోగి మంటలు వెలగవు. తరతరాలుగా ఇదే పరిస్థితి. విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామస్థులు భోగి పండుగకు దూరంగా ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ కూడా భోగి సందడి వుండేది. చాలా ఏళ్లక్రితం జరిగిన ఓ ఘటన వారిని పండగకు దూరంగా ఉండేలా చేసింది. తాము వేసిన భోగి మంటలు చెలరేగి ఎన్నో ఎద్దులు మరణించగా, దానికి సంతాపం తెలుపుతూ, వంతరాం గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు భోగి పండగ చేసుకోవడం లేదు.