: సల్మాన్ కు తాత్కాలిక ఊరట, ఆ వెంటనే ఎదురుదెబ్బ!


కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాత్కాలిక ఊరటను కలిగించిన సుప్రీంకోర్టు ఆ వెంటనే గట్టి ఎదురుదెబ్బ తాకేలా చేసింది. శిక్ష అమలుపై రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు కేసును మరోసారి విచారించాలని ఆదేశించడం తాత్కాలిక ఊరట కాగా, ఆయన విదేశీ యాత్రలకు ఉన్న అనుమతిని కోర్టు రద్దు చేయడం ఎదురుదెబ్బ. కాగా, 1988 నాటి కేసులో జోథ్‌ పూర్‌ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. కేసులో శిక్ష అమలును నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ, రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ ముగించిన అత్యున్నత న్యాయస్థానం నేడు తన నిర్ణయాన్ని వెలువరుస్తూ, పునర్విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News