: కోడి పందేలపై వీడని ఉత్కంఠ... ప.గో.జి.లో పోలీసుల తనిఖీలు, సందిగ్ధంలో పందెం రాయుళ్లు!
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రాలో కోడి పందేలపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు కోడి పందేలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీంకోర్టు ప్రకటన, తమకు హైకోర్టు ఆదేశాలే శిరోధార్యమంటూ పోలీసుల వెల్లడి నేపథ్యంలో పందెంరాయుళ్లు అయోమయంలో పడిపోయారు. నిన్న రాజమండ్రి పరిసరాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు 12 మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా లాడ్జీల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు పందెంరాయుళ్ల కోసం వేట సాగిస్తున్నారు. దీంతో కోడి పందేలు నిర్వహించడమెలా అంటూ పందెంరాయుళ్లు ఆందోళనలో పడ్డారు.