: నవ్యాంధ్ర రాజధాని భూ సమీకరణకు మూడు రోజుల విరామం


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూ సమీకరణకు మూడు రోజుల పాటు బ్రేక్ పడింది. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భూ సమీకరణను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ దఫా సంక్రాంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబునాయుడు సహా, కేబినెట్ మంత్రులు, అధికారులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన రాజధాని భూ సమీకరణకు స్వల్ప విరామమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి వేడుకల తర్వాత ఈ నెల 17న తిరిగి రాజధాని భూ సమీకరణ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News