: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత అఖిల భాతర సర్వీసు (ఐఏఎస్, ఐపీఎస్) అధికారుల కేటాయింపు ముగిసిన నేపథ్యంలో ఇటీవలే పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత 36 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం, రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావును నియమించింది. పలువురు యువ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం కీలక పోస్టింగుల్లో నియమించింది.