: కాషాయ దళానికి ప్రధాని మోదీ దన్ను: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యక్ష ఆరోపణలకు దిగారు. దేశంలో కాషాయ దళానికి ప్రధాని మోదీ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆమె ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానంటూ అధికారం చేపట్టిన మోదీ అసలు రంగు క్రమంగా బయటపడుతోందని ఆమె విమర్శించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలను నిలువరించడంలో ఆసక్తి కనబరచని మోదీ, పరోక్షంగా వారు మరింత రెచ్చిపోయేందుకు అవకాశమిస్తున్నారన్నారు. మోదీలోని నిరంకుశ వైఖరి క్రమంగా బయటపడుతోందని ఆమె ఆరోపించారు. మోదీ విధానాలతో దేశంలోని రైతుల ఆదాయాలు క్రమంగా పడిపోతున్నాయని, దీంతో రైతులు నిరాశలో కూరుకుపోయారని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News