: కమిట్ అయితే... కాంప్రమైజ్ కాను: ఏపీ సీఎం చంద్రబాబు


ఏ విషయంలోనైనా ‘‘నేను కమిట్ అయితే కాంప్రమైజ్ అయ్యే రకం కాదు’’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సందడి చేసిన చంద్రబాబు ఆ తర్వాత సొంత జిల్లా చిత్తూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని విషయంలో ఎంతమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ ప్రస్థానం కొనసాగిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితోనే చూస్తానని ప్రకటించిన ఆయన అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలను పేద ప్రజలు కూడా ఘనంగా జరుపువాలనే చంద్రన్న కానుకను ప్రకటించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో వెలిగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News