: దమ్ముంటే మళ్లీ సనత్ నగర్ నుంచి గెలువు: తలసానికి మాగంటి గోపీనాథ్ సవాల్


తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు టీడీపీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటీ గోపీనాథ్ సవాల్ విసిరారు. దమ్ముంటే మళ్లీ సనత్ నగర్ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన తలసానికి సూచించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం, టీఆర్ఎస్ విజయం నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన తలసాని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ప్రకటించారు. తలసాని వ్యాఖ్యలను గోపీనాథ్ తీవ్రంగా పరిగణించారు. కంటోన్మెంట్ ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా జరగలేదన్న విషయాన్ని తలసాని మరిచిపోతున్నారని చెప్పిన మాగంటి, దమ్ముంటే సనత్ నగర్ లో మళ్లీ పోటి చేసి విజయం సాధించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News