: ఢిల్లీ ఎన్నికల్లో నూటొక్క మందితో కాంగ్రెస్ ప్రచార కమిటీ... స్టార్ క్యాంపెయినర్ గా షీలా దీక్షిత్!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముమ్మర సన్నహాలు చేస్తోంది. మొత్తం 101 మందితో కూడిన ఎన్నికల ప్రచార కమిటీని పార్టీ అధిష్ఠానం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, మొన్నటి ఎన్నికల్లో ఆప్ చేతిలో ఎదురుదెబ్బ తిన్న పార్టీ మహిళా నేత షీలా దీక్షిత్ ను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. ప్రచార కమిటీకి అజయ్ మాకెన్ నేతృత్వం వహిస్తారని ప్రకటించిన పార్టీ సీనియర్ నేత పీసీ చాకో, పార్టీ ప్రచారంలో షీలా దీక్షిత్ కీలక భూమిక పోషిస్తారని వెల్లడించారు.ఎన్నికల బరిలో నిలవనున్న 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రూపొందించామని, పూర్తి స్థాయి జాబితాను రేపు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News