: నిమ్మకూరు సంక్రాంతి సంబరాలకు బాలయ్య... మూడు రోజులూ అక్కడేనట!


హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలనున్నారు. సంక్రాంతి సంబరాలకు తన బావ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సొంతూరు నారావారిపల్లెకు వెళుతుండగా, బాలయ్య కూడా తన సొంతూరు నిమ్మకూరుకు పయనమవుతున్నారు. మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా సాగనున్న సంక్రాంతి సంబరాలను పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు బాలయ్య సన్నాహాలు చేసుకుంటున్నారు. సంబరాలు జరిగే మూడు రోజుల పాటు ఆయన నిమ్మకూరులోనే ఉండనున్నారు.

  • Loading...

More Telugu News