: కంటోన్మెంట్ లో ఎప్పుడూ అధికార పార్టీదే విజయం: ఫలితాలపై శంకరన్న కొత్త భాష్యం


కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్ రావు కొత్త వాదన వినిపించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీదే విజయమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారని ఆయన తన వాదనను బలపరిచే యత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఓట్ల లెక్కింపులో మొత్తం ఎనిమిది వార్డుల్లో ఒకే ఒక్క స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. దీంతో కంగుతిన్న ఆయన పార్టీ పరాజయాన్ని కప్పిపుచ్చే యత్నంలో భాగంగా అధికార పార్టీదే విజయమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News