: మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. ఒకవైపు అంతర్గత ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. సాంబ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగగా, భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.