: ఇస్రో చైర్మన్ గా ఆలూరి కిరణ్ కుమార్ నియామకం
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చైర్మన్ గా కర్ణాటకకు చెందిన ఆలూరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ 1975 నుంచి ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. చంద్రయాన్-1తో పాటు మంగళ్ యాన్ లలోనూ కిరణ్ కుమార్ కీలక భూమిక పోషించారు. మొన్నటిదాకా ఇస్రో చైర్మన్ గా పనిచేసిన రాధాకృష్ణన్ గత నెల 31న పదవీ విమరణ చేసిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణన్ స్థానంలో తాత్కాలిక చైర్మన్ గా శైలేశ్ నాయక్ ను నియమించిన ప్రభుత్వం తాజాగా కిరణ్ కుమార్ ను రెగ్యులర్ చైర్మన్ గా నియమించింది. ఇస్రో చైర్మన్ గా కిరణ్ కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.