: సర్వే సత్యనారాయణకు మరో షాక్... కుమారుడు కూడా ఓడిపోయారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు మరో షాక్ తగిలింది. ఐదో వార్డులో ఆయన కుమారుడు నవనీత్ ఓటమి పాలయ్యారు. మరోవైపు రెండో వార్డులో పోటీ చేసిన సర్వే కూతురు సుహాసిని కూడా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కుమారుడు, కుమార్తె ఇద్దరూ కూడా ఓటమి బాట పట్టడంతో సర్వే సత్యనారాయణ కుటుంబం వద్ద నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సర్వే కూడా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.