: పల్లెబాట పట్టిన తెలుగు ప్రజలు... బస్సు, రైల్వే స్టేషన్లు కిటకిట


హైదరాబాదు మహానగరం పల్లెబాట పట్టింది. మూటాముల్లె సర్దుకుని సొంతూరికి, అయినవారి చెంతకు సాగిపోతోంది. ఉపాధి కోసం ఆశల సౌధాలను నిర్మించుకుని పట్టణ బాట పట్టిన వారంతా సంక్రాంతిని ఆస్వాదించేందుకు తరలిపోతున్నారు. దీంతో బస్సు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దొరికిందే అదనుగా ప్రైవేటు ట్రావెలర్స్ అందినకాడికి దండుకుంటున్నారు. సాధారణంగా పక్కవాడి చేయి తగిలితేనే కసురుకునే జనాలు, సర్దుకుపోదాం అంటూ చేయిచేయి కలిపి సాగిపోతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్‌, జేబీఎస్ ఎక్కడ చూసినా ఇసుకపోస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మరోవైపు ఎన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేస్తున్నా అవి పట్టడం లేదు. సంక్రాంతి రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కాగా, ట్రావెల్స్ అక్రమాలపై దాడులు చేసిన ఆర్టీఏ అధికారులు ధనుంజయ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులను సీజ్ చేశారు. కాగా, ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, రైల్వేలన్నీ సంక్రాంతి పేరిట ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి.

  • Loading...

More Telugu News