: తెలంగాణలో రికార్డు స్థాయి సభ్యత్వాలు నమోదు చేస్తాం: కిషన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలోకి యువతను పెద్ద సంఖ్యలో చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద 152వ జయంతి సందర్భంగా పార్టీ ఆన్‌ లైన్ సభ్యత్వాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 35 లక్షల సభ్యత్వాలు నమోదు చేయిస్తామని అన్నారు. ఆన్ లైన్ సభ్యత్వాలు ప్రారంభించిన తొలి రోజే 10 వేల మంది సభ్యులు చేరారని ఆయన తెలిపారు. పార్టీలో సభ్యులను చేర్పించేందుకు కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News