: వీబీ భౌతిక కాయం తరలింపు
ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్ర ప్రసాద్ భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. హైదరాబాదులోని ఇషా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ గత రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన మృతదేహాన్ని ఫిల్మ్ నగర్ కు తరలించమని, అన్ని కార్యక్రమాలు తమ నివాసంలోనే పూర్తి చేస్తామని ఆయన కుమారుడు, నటుడు జగపతిబాబు తెలిపిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.