: నాన్న రాజులా బతికారు...మనశ్శాంతిగా నిష్క్రమించారు: జగపతి బాబు
తన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ జీవించినంతకాలం రాజులా బతికారని జగపతిబాబు అన్నారు. ఆయన జీవితకాలంలో ఎవరినీ బాధ పెట్టలేదని... మనశ్శాంతిగా నిష్క్రమించారని జగపతిబాబు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తరలించడం లేదని చెప్పిన ఆయన, నేరుగా తమ ఇంటికే తీసుకెళ్లనున్నామని చెప్పారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన తండ్రి చాలా బాధపడ్డారని, పుంజుకోవడంతో ఆయన చాలా సంతోషించారని ఆయన వెల్లడించారు. తాను నిలదొక్కుకోవాలన్న నాన్నగారి కోరిక నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. తన కూమార్తె, తన సోదరుడి కుమార్తె పెళ్లిళ్ల కోసం ఆరాటపడిన తన తండ్రి, వారిద్దరికి పెళ్లి కుదిరిందన్న శుభవార్తలు విన్నతరువాతే కన్నుమూశారని ఆయన తెలిపారు. వీబీ మృతికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.